దాచేపల్లిలో వర్ష బీభత్సం... ఓ ఇంటిపై పిడుగుపాటు, తృటిలో తప్పిన పెనుప్రమాదం
దాచేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
దాచేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఓ ఇంటిపై పిడుగుపడింది. వర్షం పడుతుండటంతో ఇంట్లోని వారు ఎవరూ బయటకురాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పిడుగుపాటు కారణంగా ఇంట్లోని విద్యుత్ వైర్లు మొత్తం కాలిపోయాయి. దీంతో పదిలక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఇంటి యజమాని గొల్ల నారాయణ తెలిపారు. దాచేపల్లి తహసిల్దార్ సుధీర్ కుమార్ పిడుగుపాటుకు గురయిన ఇంటిని పరిశీలించారు.