Video news : తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ...
తూర్పుగోదావరి జిల్లాలోని జీ.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు.
తూర్పుగోదావరి జిల్లాలోని జీ.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు. గ్యాంగ్ రేప్ చేసి చంపిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ కాగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. హతురాలు కేసునుకుర్తి నాగమణి భర్త, కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిసున్నారు.