ఎన్టీఆర్ జిల్లాలో దారుణం... బ్యాంక్ లోన్ పేరిట ముగ్గురిని నిర్బంధించిన విసన్నపేట పోలీసులు

విజయవాడ: ఏ తప్పూ చేయకున్నా పోలీసులు తమపై దాడిచేసి ఇంట్లోని మగాళ్ళను బలవంతంగా అదుపులోకి తీసుకుని నిర్బందించారని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు.

First Published May 29, 2022, 11:58 AM IST | Last Updated May 29, 2022, 11:58 AM IST

విజయవాడ: ఏ తప్పూ చేయకున్నా పోలీసులు తమపై దాడిచేసి ఇంట్లోని మగాళ్ళను బలవంతంగా అదుపులోకి తీసుకుని నిర్బందించారని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. విసన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన ముగ్గురిని బ్యాంకు రుణం పేరిట ఏదో మాయమాటలు చెప్పిన పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారని వాపోతున్నారు. అనుమానం వచ్చి అడ్డుకోడానికి ప్రయత్నిస్తే తనను కొట్టి నెట్టేసి తీసుకెళ్లారని... వీరిని పోలీస్ స్టేషన్ లో నిర్భంధించారని మహిళ తెలిపింది.  విసన్నపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమవారిని ఎందుకు  నిర్బంధించారని ప్రశ్నస్తే పోలీసులు కనీసం సమాధానం చెప్పడానికి సిద్దంగా లేరని బాధిత మహిళలు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమ వారిని విడిచిపెట్టేలా చూడాలంటూ మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు పెట్టుకుంటున్నారు.