కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఫ్లైఓవర్‌పై ఘోరప్రమాదం జరిగింది.  

First Published Dec 10, 2020, 8:26 AM IST | Last Updated Dec 10, 2020, 8:26 AM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఫ్లైఓవర్‌పై ఘోరప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా,  ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మాచర్ల శ్యామ్(60), మాచర్ల శారద(55), మాచర్ల శ్యామల(38) మృతి చెందారు. భాగ్యలక్ష్మి, నవీన్, మాన్యశ్రీ(7), గోపి(8), అక్షయ్, డ్రైవర్ సైదులు గాయపడ్డారు. మృతులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని ఆత్కూరు వాసులుగా గుర్తించారు.  ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. వేములవాడకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు, క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు