నగదు, నగలతో ఉడాయిస్తూ పట్టుబడ్డ ఘరానా దొంగ... దేహశుద్ది చేసిన స్థానికులు

గుంటూరు: తాళం వేసివున్న ఇంట్లోకి ప్రవేశించి నగలు, నగదు మూటగట్టుకుని ఉడాయిస్తున్న దోపిడీదొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసారు. ఈ ఘటన గుంటూరు పట్టణంలోని సంపత్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సంపత్ నగర్ కాలనీలోని ఓ ఇంటికి తాళం కుటుంబసభ్యులంతా ఎక్కడికో వెళ్ళారు. ఈ ఇల్లు దొంగల కంట్లో పడగా ఆదివారం రాత్రి తాళం పగలగొట్టి దోపిడీకి యత్నించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు మూటగట్టుకుని వెళ్ళేందుకు సిద్దమవగా స్థానికులు వీరిని గమనించారు. వీరిని వెంబడించిన ఓ దొంగ స్థానికులకు పట్టుబడ్డాడు. మిగతా ఇద్దరు పరారయ్యారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు ద్విచక్ర వాహనంతో పాటు కొంత సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
 
First Published Jan 10, 2022, 10:13 AM IST | Last Updated Jan 10, 2022, 10:13 AM IST