Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి దళిత సంఘాల పిలుపు... పోలీస్ పహారాలో అవనిగడ్డ

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

First Published Nov 28, 2022, 11:52 AM IST | Last Updated Nov 28, 2022, 11:52 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చల్లపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ కృష్ణకుమారి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అవమానించారంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా ప్రతిపక్ష టిడిపితో దళిత సంఘాలు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే అప్రమత్తమైన పోలీసులు నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులను తెల్లవారుజామునుండే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా అవనిగడ్డలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు. పట్టణానికి వచ్చే పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.