నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆందోళన... తెలుగు యువత నాయకుల అరెస్ట్

గుంటూరు: మాంసం దుకాణాలు మాకొద్దు ప్రభుత్వ ఉద్యోగాలే ముద్దు అంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు.

First Published May 6, 2022, 2:43 PM IST | Last Updated May 6, 2022, 2:43 PM IST

గుంటూరు: మాంసం దుకాణాలు మాకొద్దు ప్రభుత్వ ఉద్యోగాలే ముద్దు అంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ సీపీ చేపట్టిన మెగా జాబ్ మేళా ను నిరసిస్తూ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేసారు. మాకు కావాల్సింది "మటన్ కొట్టే ఉద్యోగాలు కాదు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు" అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు తెలుగు యువత నాయకులను అదుపులోకి తీసుకొని పెదకాకాని పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు.