ఏపీలో తెలంగాణ మద్యం కిక్కు... దాచేపల్లిలో భారీగా పట్టుబడ్డ మ్యాన్షన్ హౌస్ బాటిల్స్
గుంటూరు: తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా వుండటంతో అక్రమంగా ఏపీకి తరలించి సొమ్ముచేసుకునే ముఠాలు ఎక్కువయ్యాయి.
గుంటూరు: తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా వుండటంతో అక్రమంగా ఏపీకి తరలించి సొమ్ముచేసుకునే ముఠాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ బార్డర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి తనిఖీలు చేపడుతున్నా పోలీసుల కళ్లుగప్పి మద్యాన్ని తరలిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలా బార్డర్ దాటి గుంటూరు జిల్లాకు వచ్చిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి మండలం పొందుగుల వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ టాటా ఏస్ వాహనం అక్కడికి వచ్చింది. పోలీసులను చూసి భయపడిపోయి వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా తెలంగాణకు చెందిన 286 మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మద్యం బాటిల్స్ లభించాయి. వాటి విలువు లక్షా పదివేలు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మద్యంతో పాటు వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు... పరారయిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు దాచేపల్లి పోలీసులు తెలిపారు.