ఏపీకి వచ్చింది అందుకోసమే... త్వరలోనే కీలక నిర్ణయం : మాజీ సీఎస్ సోమేష్ కుమార్
గన్నవరం : తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు.
గన్నవరం : తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సీఎస్ పదవి కోల్పోయిన సోమేష్ ను ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డిఓపిటి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి విజయవాడకు వెళ్లి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ.... ఒక అధికారిగా డిఓపిటి ఆదేశాలు పాటిస్తున్నానని... అందుకే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి వచ్చానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా వెళ్లడం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... సీఎం జగన్ ను కలిసిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఏ అధికారికి చిన్న పోస్టు, పెద్ద పోస్టు అనే తేడా ఉండదని... ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా చేయాలని సోమేష్ పేర్కొన్నారు.