దాచేపల్లిలో ఎన్నికల హడావుడి... పోటీపోటీగా వైసిపి, టిడిపి నామినేషన్లు
గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది.
గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. అన్ని పార్టీల అభ్యర్ధులు ముఖ్య నేతలను వెంటబెట్టుకుని తెల్లవారుజామునుంచే భారీ ఊరేగింపు మధ్య నామినేషన్లు వేయడానికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులను దగ్గరుండి నామినేషన్ వేయించారు గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు. ఇక వైసిపి నేతల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి.