సీఎం జగన్ ఫోటోకు చీఫ్ లిక్కర్ తో అభిషేకం... మంగళగిరి మహిళల వినూత్న నిరసన
అమరావతి: రాష్ట్రంలో కల్తీసారా నిర్మూలన, మద్యం షాపుల్లో జె-బ్రాండ్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి మహిళలు టీడీపీ శ్రేణుల వినూత్న నిరసన తెలిపారు. తాళిబొట్లు, జే బ్రాండ్ మద్యం సీసాలతో టీడీపీ కార్యకర్తల ధర్నా చేపట్టారు. జే బ్రాండ్ మద్యంతో సీఎం జగన్ చిత్రపటానికి అభిషేకం చేసారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించగా మహిళలు వాగ్వాదానికి దిగారు. తాడేపల్లి టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయం నుంచి స్థానిక గాంధీ విగ్రహం వరకు ఫ్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీసారా నిర్మూలించలేని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మంచిబుద్ధి వచ్చేలా చూడాలని కోరుతూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.