Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు ఆ గర్వం ఎక్కువ.. అందుకే రాజధాని మార్పు.. నిమ్మకాయల చినరాజప్ప..

సీఎం జగన్ కు ప్రజలమీద నమ్మకముంటే చంద్రబాబు సవాల్ ను తీసుకోవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ హోమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు

సీఎం జగన్ కు ప్రజలమీద నమ్మకముంటే చంద్రబాబు సవాల్ ను తీసుకోవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ హోమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. వైసీపీకి 130 సీట్లు వచ్చాయన్న గర్వంతోనే రాజధాని మార్చారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు రాజధాని ఇక్కడే కొనసాగిస్తాం అని మభ్యపెట్టారు. అందుకే ఓట్లు వేశారు. మాట తప్పం, మడమ తిప్పం అన్న జగన్ రాజధానిమీద ఎందుకు మాట మార్చారో తెలపాలన్నారు. చంద్రబాబు ఇళ్లు కట్టుకోలేదని వైసీపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు. అమరావతి మీద పూర్తి కాన్సట్రేషన్ చేయడం వల్లే ఇల్లు కట్టుకోలేకపోయాడని దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను స్వీకరించాలన్నారు