Asianet News TeluguAsianet News Telugu
breaking news image

టిడిపి-వైసిపి అసెంబ్లీ ఫైట్... తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు పంచాయితీ

అమరావతి : అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి సభ్యులు నిన్న(సోమవారం) ఏకంగా అసెంబ్లీలోనే గొడవపడ్డ విషయం తెలిసిందే. 

అమరావతి : అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి సభ్యులు నిన్న(సోమవారం) ఏకంగా అసెంబ్లీలోనే గొడవపడ్డ విషయం తెలిసిందే. తమపై టిడిపి ఎమ్మెల్యేలు దాడిచేసారని వైసిపి ఎమ్మెల్యేలు, కాదు కాదు తమపైనే దాడి జరిగిందని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. అసెంబ్లీలో జీవో1 పై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న తమపై ఓ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు భౌతిక దాడికి దిగారని ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బెందాళం అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టిడిపి ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు,వైసిపి ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలిజా, వెల్లంపల్లి శ్రీనివాస్ రావుపై ఫిర్యాదు చేసారు. వారు ఎలా దాడిచేసారో ఫిర్యాదులో వివరిస్తూ ప్రాణాలకు హాని తలపెడతామని బెదిరించారని డోలా వీరాంజనేయులు ఫిర్యాదులో పేర్కొన్నారు.