AP Assembly : స్పీకర్ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యుల వాకౌట్...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. దీంతో కాసేపు స్పీకర్-చంద్రబాబు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.