టీడీపీ నేతలు అభివృద్ధి పనులను అడ్డుకోవద్దు
పేదల ఇళ్ళ,పాఠశాలలు,స్మశాన వాటికలకు చేపడుతున్న మెరక పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య.
పేదల ఇళ్ళ,పాఠశాలలు,స్మశాన వాటికలకు చేపడుతున్న మెరక పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు విలేఖరులతో మాట్లాడుతూ నాగాయతిప్ప స్కూల్ ఆటస్థలం మెరక చేసేందుకు ఇసుక తోలుతుంటే పర్యావరణం ముప్పు పేరుతో టీడీపీ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.గతంలో మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారి ఇంటికి అక్రమంగా ఎడ్లంక రేవు ప్రక్క నుంచి వందలాది ట్రక్కులు ఇసుక తోలుకున్నప్పుడు పర్యావరం గుర్తుకు రాలేదా" అని కడవకాల్లు ఎద్దేవా చేశారు.