విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి టిడిపి యత్నం... తీవ్ర ఉద్రిక్తత
విజయవాడ: రాష్ట్ర ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న జే బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద టిడిపి ధర్నా చేపట్టింది.
విజయవాడ: రాష్ట్ర ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న జే బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద టిడిపి ధర్నా చేపట్టింది. జంగారెడ్డిగూడెంలోో ఇటీవల కల్తీ నాటుసారా తాగి చాలామంది చనిపోయారంటూ టిడిపి అసెంబ్లీ వేదికన ఆందోళన చేపడుతోంది. అయితే టిడిపి సభ్యులను గొంతును ప్రజలకు వినిపించనివ్వకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి టిడిపి సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(బుధవారం) విజయవాడలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద ముఖ్య నాయకుల ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నేతలు, కార్యకర్తలు ర్యాలీగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనికి టీడీపీ నేతలను అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.