Video : తక్కెడలో ఓ వైపు బంగారం, మరోవైపు ఉల్లిగడ్డలు....

పెరిగిన ఉల్లిధరలు తగ్గించాలంటూ అమరావతి సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసన చేపట్టారు. 

First Published Dec 9, 2019, 10:37 AM IST | Last Updated Dec 9, 2019, 12:02 PM IST

పెరిగిన ఉల్లిధరలు తగ్గించాలంటూ అమరావతి సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని వినూత్న నిరసన తెలిపారు.  బంగారం, ఉల్లిధరలు సమానంగా ఉన్నాయంటూ తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి మాజీముఖ్యమంత్రి చూపించారు. అయితే ప్లకార్డులతో అసెంబ్లీ లోకి ప్రవేశించాలనుకున్న నేతలను అమరావతి అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పోలీసులకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.