అక్రమాలకు నిలయంగా ఆంధ్రా యూనివర్సిటీ.. విసిపై సిబిఐ విచారణ..: టిడిపి నేత పల్లా డిమాండ్
విశాఖపట్నం: ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీని రాజకీయ హబ్ గా మార్చిన వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలన్న పార్టీలన్ని అఖిలపక్షంగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నాయని టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు.
విశాఖపట్నం: ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీని రాజకీయ హబ్ గా మార్చిన వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలన్న పార్టీలన్ని అఖిలపక్షంగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నాయని టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న(గురువారం) చలో ఆంధ్రా యూనివర్సిటీ కి పిలుపునిస్తే పోలీసులతో అడ్డంకున్నారని... ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఉద్యమం ఆగదని పల్లా స్పష్టం చేసారు. ఏయూ వీసీ అవినీతిపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం, ఉక్కుపాదం మోపడం కరెక్ట్ కాదన్నారు. ఏయూ రివాల్యూషన్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని... వీటిపై విచారణ చేయాలని పల్లా కోరారు. కేంద్రం విడుదల చేసిన రుసా నిధులు కూడా వీసీ ఇష్టాసారంగా వినియగించారన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏయూ వీసీగా చాలామంది పనిచేసారు... కానీదీన్ని రాజకీయ హబ్ గా చేసిన ఘనత ప్రసాద్ రెడ్డిదే అని పల్లా ఎద్దేవా చేసారు. పొలిటికల్ పవర్ కోసం యూనివర్సిటీ రాజకీయ వేదిక చేయడం సరికాదన్నారు. వెంటనే వీసీని రీకాల్ చేసి ఆయనపై సీబీఐతో విచారణ జరిపించాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేసారు.