Asianet News TeluguAsianet News Telugu

సిద్దా రాఘవరావు మాదిరే గొట్టిపాటి రవిని కూడా ... నిమ్మకాయల చిన్న రాజప్ప

ఈ ప్రభుత్వం వైఫల్యాలకు సమాధానం చెప్పలేక మాట్లాడుతున్న వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అమరావతిలో నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. 

ఈ ప్రభుత్వం వైఫల్యాలకు సమాధానం చెప్పలేక మాట్లాడుతున్న వారిని అరెస్టు చేసే కార్యక్రమానికిశ్రీకారం చుట్టిందని అమరావతిలో నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. వాట్స్ యాప్ మెసేజ్ నుపార్వడ్ చేసినందుకు నందిగామ కృష్ణ, నలంద కిషోర్ లను అరెస్టు చేసి విశాఖపట్నం నుండి కర్నూలువరకు తీసుకెళ్లి వేదించారు. అదే రీతిలో తూర్పు గోదావరి జిల్లా నుండి వట్టికూట నరసింహారావును నిన్నసాయంత్రం రామచంద్రాపురంలో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లి వేదిస్తున్నారు. వైకాపా నాయకులుమాత్రం చంద్రబాబును, లోకేష్ బాబును, అచ్చెన్నాయుడును కించపరిచే విధంగా మాట్లాడుతున్నాపోలిసులు పట్టించుకోవడం లేదు.  తూర్పు గోదావరి జిల్లాలోని వంతడలో గత పదేళ్లుగా గనులు లీజుకుతీసుకుని వ్యాపారం చేస్తున్న పూతల శేషగిరిరావు వైకాపా ప్రభుత్వం వేధింపులకు గురి చేయడంతో హార్ట్ఎటాక్ చనిపోయారు. వైకాపా బెదిరింపులతో చాలా మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.