పొన్నూరులో ఉద్రిక్తత... పోలీసులు, టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం

గుంటూరు: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళల్లో అర్హులను అన్యాయంగా తొలగించారంటూ పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ నిరసనకు దిగారు.

First Published Jan 12, 2021, 1:16 PM IST | Last Updated Jan 12, 2021, 1:34 PM IST

గుంటూరు: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళల్లో అర్హులను అన్యాయంగా తొలగించారంటూ పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పొన్నూరు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేయడానికి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లడానికి యత్నించిన ఆయనతో పాటు  తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నరేంద్రకుమార్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయం లోపలికి పంపించక పోవడంతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు నరేంద్ర కుమార్.

ఇలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో నరేంద్ర  కుమార్ ను కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. గతంలో మంజూరైన టిడ్కో ఇళ్ళకు సంబంధించిన,  బ్యాంకులో మంజూరు అయిన ఋణాలకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారుల సమక్షంలో అందచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని  కమీషనర్ ను కోరారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే వారి తరుపున ఎంతటి పోరాటానికి అయినా సిద్దమని నరేంద్రకుమార్ హెచ్చరించారు.