అరేయ్ కొడాలి నాని... నువ్వెక్కడ పుట్టావు, నీ తండ్రి పేరేంట్రా? : బుద్దా వెంకన్న సంచలనం

అమరావతి : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను ఊరకుక్క కొడాలి నాని తిట్టడం హాస్యాస్పదంగా వుందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. 

First Published Feb 16, 2023, 1:25 PM IST | Last Updated Feb 16, 2023, 1:25 PM IST

అమరావతి : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను ఊరకుక్క కొడాలి నాని తిట్టడం హాస్యాస్పదంగా వుందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగానే జగన్ పిచ్చికుక్కలను రోడ్లపైకి వదిలాడని... అలాంటి ఓ కుక్కే చంద్రబాబు, లోకేష్ పై నోరు పారేసుకుంటోందని అన్నారు. గుడివాడలో జేబులు కొట్టేసే నాని కూడా చంద్రబాబును తిడుతున్నాడని... ఈ ఉల్లిపాయ పకొడీ గాడు అందరూ తనలాగే దగా నా కొడుకులు అనుకుంటున్నట్లు వున్నాడన్నారు. చంద్రబాబు నాన్న పేరేంటని వీడు అడుగుతున్నాడు... అసలు నీ నాన్న పేరేంటో చెప్పరా? అని నిలదీసారు. నువ్వేమయినా ఎన్టీఆర్ వారసుడివవేంట్రా... లోకేష్ వారసుడు కాదా? ఎక్కడ పుట్టావో తెలియని నువ్వు ఎన్టీఆర్ వారసుడివి ఎలా అవుతావు రా అంటూ కొడాలి నానిపై బుద్దా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.