వివేకా హత్యకు కుట్రపన్నింది జగన్ కుటుంబమే...: మాజీ మంత్రి బండారు సంచలనం
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులంతా కలిసి వారి కుటుంబానికే చెందిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులంతా కలిసి వారి కుటుంబానికే చెందిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. సానుభూతితో ఓట్లు పొంది పదవి దక్కించుకోవాలని సొంత చిన్నాన్న చంపిన వ్యక్తి ఈ జగన్ అని మండిపడ్డారు. గతంలో టిడిపి నేత పరిటాల రవి హత్యకు కుట్రపన్నిన వ్యక్తి కూడా ఈ జగనేనని ఆరోపించారు. ఇలా హత్యా రాజకీయాలను చూసిన జగన్ ను సీఎంగా చూస్తున్నామని మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.