మద్యం సీసాలు చేతబట్టి... అసెంబ్లీ ప్రాంగణంలో లోకేష్ నేతృత్వంలో టిడిపి నిరసన
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఇవాళ(సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై దద్దరిల్లింది. జంగారెడ్డిగూడెంలో మరణాలు కల్లీ సారా కారణంగానే జరిగాయంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్ష టిడిపి అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం ఇవన్నీ సాధారణ మరణాలుగా పేర్కొంటూ చర్చకు నిరాకరించడంతో టిడిపి సభ్యులు శాసనసభ, శాసన మండలితో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు.రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలను అరికట్టడంతో జగన్ సర్కార్ విఫలమయ్యింందని ఆరోపిస్తూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి సభ్యులు నిరసన చేపట్టారు. మద్యం సీసాలతో అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.