పీలేరు సబ్ జైలుకు చంద్రబాబు... పార్టీ నేతలను పరామర్శించిన టిడిపి అధినేత
చిత్తూరు : ఇటీవల పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులతో గొడవ కారణంగా అరెస్టయిన టిడిపి నేతలను ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
చిత్తూరు : ఇటీవల పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులతో గొడవ కారణంగా అరెస్టయిన టిడిపి నేతలను ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రొంపిచర్ల బస్టాండ్ సెంటర్లో మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ప్లెక్సీలు, బ్యానర్ల ధ్వంసం విషయంలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అరెస్టయి పీలేరు సబ్ జైల్లో వుంటున్న టిడిపి నాయకులను ఇవాళ చంద్రబాబు పరామర్శించారు. నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ కు వెళుతున్నారు. అంతకంటే ముందే పీలేరుకు వెళ్లి టిడిపి నేతలను పరామర్శించారు.