Tangirala Sowmya : తుగ్లక్ పరిపాలన కళ్లారా చూస్తున్నాం...

కంచికచర్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు జరిగాయి. 

First Published Dec 27, 2019, 3:23 PM IST | Last Updated Dec 27, 2019, 3:23 PM IST

కంచికచర్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు జరిగాయి. జగన్ మొండి వైఖరి నశించాలి, సీఎం డౌన్ డౌన్, మూడు ముక్కలాట మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు  నినాదాలు చేశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తుగ్లక్ పరిపాలన గురించి పుస్తకాల్లో చదువుకున్నాం..ఇప్పుడు తుగ్లక్ పరిపాలన కళ్లారా చూస్తున్నాం అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు.