తాడికొండ వైసీపీలో మళ్లీ కలకలం.. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజీనామా
వై.ఎస్.ఆర్.ఎస్.సి.పి తాడికొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ మోహిద్దీన్ తన పదవికి రాజీనామా చేశాడు.
వై.ఎస్.ఆర్.ఎస్.సి.పి తాడికొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ మోహిద్దీన్ తన పదవికి రాజీనామా చేశాడు. తాడికొండ ఎం.ఎల్.ఏ ఉండవల్లి శ్రీదేవి వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన అన్నాడు. తనను కార్యాలయంలో అందరిముందు అవమానించిందని ఆరోపించాడు. పదవికి రాజీనామా చేసినా తాను పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని జగన్ కు లేఖ రాశాడు.