అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు... జగన్, కేసీఆర్ సర్కార్లకు స్వరూపానందేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్
విశాఖపట్నం : హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే అయ్యప్ప స్వామిపై ఇటీవల బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం : హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే అయ్యప్ప స్వామిపై ఇటీవల బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఘాటుగా స్పందించారు. భారతదేశంలో హిందూ జాతిని మేల్కొలిపై గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ప్రముఖమైనదని... అలాంటిది అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడుపోయేవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అయ్యప్ప స్వామిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు తగదని అన్నారు.
హిందూ దేవుళ్లపై దూషణలను అంత ఈజీగా తీసుకోవద్దని... ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని స్వరూపానందేంద్ర సూచించారు. మైనారిటీలే కాదు హిందువులు కూడా ఓటర్లే అని పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. కాబట్టి హిందూ సమాజాన్ని కించపర్చేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై సరైన సెక్షన్లు పెట్టి జైల్లో కుక్కాలని సూచించారు.
తెలంగాణ, ఆంధ్రలో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తగిన శాస్తి జరపాలని స్వరూపానందేంద్ర డిమాండ్ చేసారు