నిండా ముంచిన అకాల వర్షాలు... నూజివీడు మామిడి రైతుల ఆందోళన

నూజివీడు: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. 

First Published Jan 19, 2022, 5:09 PM IST | Last Updated Jan 19, 2022, 5:09 PM IST

నూజివీడు: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పాటు  వివిధ తెగుళ్ళ కారణంగా మామిడి పూత రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అధికారులు, ప్రభుత్వం మామిడిలో పూత దశలో వస్తున్న తెగుళ్లకు పరిష్కారం చూపాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో మామిడి సాగయ్యే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మామిడిపూత రంగు మారడంతోపాటు తామర పురుగు, తెల్లపేను ఆశించి రాలిపోతోందట. పూత దశలో ఎన్ని రసాయనిక ఎరువులు పిచికారి చేసినప్పటికీ నిలబడే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.