ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు మందలించారని.. యువకుడు ఆత్మహత్య
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద అవుటపల్లికి చెందిన పలగాని రమేష్ విజయవాడలో వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడని మందలించడంతో, రాత్రి 10 గంల సమయంలో ఇంటి నుండి బైటికొచ్చి తన తోటి స్నేహితుడికి i miss u అని మెసేజ్ పెట్టి కేసరపల్లి కాలువ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.