వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై విశాఖలో రాళ్లదాడి... నిందితులు వీళ్లే...(సిసి వీడియో)
విశాఖపట్నం : ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వేగంగా గమ్యానికి చేర్చేందుకు భారత రైల్వే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభిస్తోంది.
విశాఖపట్నం : ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వేగంగా గమ్యానికి చేర్చేందుకు భారత రైల్వే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభిస్తోంది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించి ఈ వందే భారత్ ట్రైన్స్ ను ఇప్పటికే పలురాష్ట్రాల్లో ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే చెన్నై నుండి విశాఖకు వస్తున్న ఈ రైలుపై కంచరపాలెం వద్ద కొందరు ఆకతాయిలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, విశాఖ పోలీసులు సిసి కెమెరాలో రికార్డయిన దాడి దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి రైల్వే కోర్టులో హాజరుపర్చారు.
గోశాల శంకర్, సిర్ల శివ, పెద్దాడ రాజ్ కుమార్, టేకేటి చందు రైల్వే ట్రాక్ సమీపంలో మద్యం సేవిస్తుండగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ వెళుతుండటాన్ని గమనించారు. దీంతో మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన వీరు ఆ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన ఆర్‌పిఎఫ్ పోలీసులు వెంబడించడంతో దొరకకుండా అక్కడినుండి పరారయ్యారు. అయితే ప్రారంభానికి ముందే వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడికి పాల్పడటం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా