అయోధ్య భూమి పూజను టెలికాస్ట్ చేయని ఎస్వీబీసీ.. మండిపడుతున్న బీజేపీ..

అయోధ్య రామమందిర భూమి పూజను ఎస్వీబీసీ ఛానల్ లైవ్ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

First Published Aug 6, 2020, 2:15 PM IST | Last Updated Aug 6, 2020, 2:15 PM IST

అయోధ్య రామమందిర భూమి పూజను ఎస్వీబీసీ ఛానల్ లైవ్ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్  బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాన్ని గంటలపాటు ఇస్తే టిటిడి ఎందుకు చేయలేదని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టి 24 గంటలలో  బాద్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.