శివమాల ధరించి మరీ పెద్దిరెడ్డికి పాదాభివందనం... వివాదంలో శ్రీశైల ఆలయ ఈవో

శ్రీశైలం : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ఈవో లవన్న తీరు వివాదాస్పదంగా మారింది. 

First Published Feb 20, 2023, 4:49 PM IST | Last Updated Feb 20, 2023, 4:49 PM IST

శ్రీశైలం : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ఈవో లవన్న తీరు వివాదాస్పదంగా మారింది. మల్లికార్జున స్వామి సేవలో తరించాల్సిన అధికారి వీఐపిలు, అధికారపార్టీ నాయకుల సేవకే పరిమితమయ్యాడని ఆరోపణలున్నారు. వీటిని నిజం చేస్తూ శివరాత్రి వేడుకల్లో ఈవో లవన్న తీరు వివాదాస్పదం అయ్యింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీశైలంకు విచ్చేయగా శివమాలలో వున్న ఈవో లవన్న ఆయన కాల్లు మొక్కాడు. అంతేకాదు మంత్రి వద్దని వారిస్తున్నా దండ వేసి దండం పెట్టేవరకు వదిలిపెట్టలేదు. ఇలా శివమాల ధరించిన ఈవో శివభక్తుల మనోభావాలను దెబ్బతీసాడని... వెంటనే ఆయనను సస్పెడ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం ఈవో లవన్న తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.