Asianet News TeluguAsianet News Telugu

దుగ్గిరాల ప్రభుత్వ హాస్టల్లో దారుణం... మైనర్ బాలికతో వార్డెన్ భర్త వెకిలిచేష్టలు

గుంటూరు : సాంఘిక సంక్షేమ హాస్టల్ బాలికపై వార్డెన్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. 

గుంటూరు : సాంఘిక సంక్షేమ హాస్టల్ బాలికపై వార్డెన్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. దుగ్గిరాలలోని బాలికల వసతి గృహంలో వుండి పదోతరగతి చదువుకుంటున్న మైనర్ బాలికపై వార్డెన్ భర్త కన్నేసాడు. ఇదివరకే ఓసారి లైంగిక వేధింపులకు పాల్పడ్డ నీచుడు తాజాగా మరోసారి అలాగే వ్యవహరించాడు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి వార్డెన్ భర్త వద్ద బాలిక ఫోన్ తీసుకుని తిరిగి ఇస్తుండగా అతడు వెకిలిగా ప్రవర్తించాడు. బాలికను ఒంటిపై చెయ్యేసి తాకకూడని చోట తాకాడు. దీంతో అతడి నుండి తప్పించుకున్న బాలిక కన్నీరు పెట్టుకుంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వార్డెన్ భర్త పవన్ పై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.