న్యూ ఇయర్ వేడుకల కోసం విశాఖకు భారీగా డ్రగ్స్... స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
విశాఖపట్నం : నూతన సంవత్సర వేడుకల్లో యువతకు అమ్మేందుకు భారీగా డ్రగ్స్ సేకరిస్తున్న ఓ ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు.
విశాఖపట్నం : నూతన సంవత్సర వేడుకల్లో యువతకు అమ్మేందుకు భారీగా డ్రగ్స్ సేకరిస్తున్న ఓ ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఐదుగురు నిందితుల నుండి 70 గ్రాముల నిషేదిత ఎండిఎంఏ డ్రగ్స్ పట్టుకున్నట్లు డిసిపి ఆనంద్ రెడ్డి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, నిషేధిత మత్తుపదార్థాలతో పట్టుపడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని డిసిపి హెచ్చరించారు.
ట్రావెల్ బిజినెస్ లో నష్టాలు రావడంతో సుంకర ప్రశాంత్ అనే యువకుడు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు హోటల్ మేనేజ్మెంట్ కలిసి చదువుకున్నారని... ఈ స్నేహంతోనే అందరూ కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రారంభించారని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా 90 గ్రాముల డ్రగ్స్ ను బెంగళూరు నుండి తీసుకువచ్చారని... అందులో 20 గ్రాములు అమ్మగా మిగతా 70 గ్రాములతో పట్టుబడ్డారని విశాఖ డిసిపి వెల్లడించారు.