అంగరంగ వైభవంగా సింహాచలం అప్పన్న కల్యాణం
విజయనగరం: సింహాచలం అప్పన్నస్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణ మండపంలో అధిష్టింపజేసిన అర్చకులు కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ,
విజయనగరం: సింహాచలం అప్పన్నస్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణ మండపంలో అధిష్టింపజేసిన అర్చకులు కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.