విశాఖ శారదాపీఠంలో ఘనంగా శంకర జయంతి వేడుకలు...

విశాఖపట్నంలోని శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

First Published May 6, 2022, 3:41 PM IST | Last Updated May 6, 2022, 3:41 PM IST

విశాఖపట్నంలోని శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాదికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతులమీదుగా ఆదిశంకరాచార్యుల విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు.  

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ... ఆది శంకరులు అవతరించకపోతే భారతదేశం అతలాకుతలమయ్యేదన్నారు. హైందవ జాతిని నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరులు అని అన్నారు. అలాగని ఆయన ఏ వర్గానికో పరిమితం కాదు... అందరివాడని అన్నారు. వైష్ణవులు, శైవుల మధ్య భేదాలు సృష్టించే ఉన్మాదులు మళ్ళీ తయారయ్యారని... ఈ పరిస్థితుల్లో శంకరతత్వం విస్తృతం కావాల్సిన అవసరముందన్నారు. శంకర జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని స్వరూపానందేంద్ర కోరారు.