sankranthi 2022: నేడు హరిదాసుల పరిస్థితి ఇదీ...
సంక్రాంతి: సంక్రాంతి పండగ వచ్చిందంటే గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతోనే రోజు తెల్లారేది. కానీ నేడు సంక్రాంతి ఆనాటి శోభ కోల్పోయింది. తన తాత ముత్తాతల నుండి వచ్చిన కులవృత్తి నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని నందిగామకు చెందిన కోటయ్య ఆందోళన వ్యక్తం చేసారు. ఆ రోజుల్లో నందిగామ పట్టణమంతా తిరిగి బిక్షాటన చేస్తే ఒక సంవత్సరానికి సరిపడా ధాన్యం వచ్చాయని... ఇప్పుడు తమ వృత్తి కనుమరుగై బ్రతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని... ప్రభుత్వం కనికరించి తనకు సహాయం చేయాలని కోటయ్య కోరుకుంటున్నారు.