వైదికంగా విశిష్టమైన పండుగ భోగి... స్వాత్మానందేంద్ర స్వామి

సింహాచలం పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. 

First Published Jan 14, 2023, 1:43 PM IST | Last Updated Jan 14, 2023, 1:43 PM IST

సింహాచలం పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల పాటు సాగే సంక్రాంతి సంబరాలను విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రారంభించారు. భోగి మంటల వద్ద దేవస్థానం పండితులు పూజలు నిర్వహించారు. మంటల్లో పిడకలు వేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సామాన్యుల పండుగగా అభివర్ణించారు. భోగి పండుగకు వైదికంగా, పౌరాణికంగా విశిష్టత ఉందని అన్నారు. పల్లె సంప్రదాయాలను పాటిస్తూ పట్టణ ప్రాంతాల్లోను విశేషంగా పండుగలను జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. సింహాచలం దేవస్థానం ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.