Sankranthi 2022: కుటుంబసమేతంగా బోగిమంటలు వేసిన మంత్రి పేర్ని నాని
విజయవాడ: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజయిన ఇవాళ పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా ఎక్కడచూసినా బోగి మంటలు వెలిసాయి. కృష్ణా జిల్లా విజయవాడలో ఉదయం నుండే సాంప్రదాయబద్దంగా పిల్లాపాపలతో కలిసి బోగిమంటలు వేసి సందడి చేస్తున్నారు.ఇక మచిలీపట్నంలోని తన నివాసంలో సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సమేతంగా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇవాళ భోగి మంటలు వేసి పండుగను ఆచరించారు. ఈ సందర్భంగా మంత్రి నాని తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగలు ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.