అనకాపల్లి జిల్లాలో నయా స్టైల్ ఇసుకదందా... ఎడ్ల బండ్లపై ఇసుక అక్రమ రవాణా

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతి నగరం గ్రామంలో ఇసుక అక్రమ దందా యదేచ్చగా సాగుతోంది.  

First Published May 20, 2022, 5:13 PM IST | Last Updated May 20, 2022, 5:13 PM IST

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతి నగరం గ్రామంలో ఇసుక అక్రమ దందా యదేచ్చగా సాగుతోంది.  నేతలు, అధికారుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా ముఠా రెచ్చిపోతోంది. ప్రతిరోజు సుమారు 90కి పైగా ఎడ్ల బళ్లద్వారా శారదా నదిలో నుండి ఇసుకను తీసుకువచ్చి అర్ధరాత్రులు లారీలపై ఇతర ప్రాంతాలకు అనధికారికంగా తరలిస్తున్నారు ఇసుక అక్రమదందా వ్యాపారులు. ఇలా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసినా రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.   
సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కై ప్రతి నెలా లక్షల్లో ముడుపులు అందుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.