ఇంజన్ నుండి విడిపోయి పట్టాలపైనే బోగీలు... సమతా ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
పార్వతీపురం: విశాఖపట్నం నుండి డిల్లీకి వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.
పార్వతీపురం: విశాఖపట్నం నుండి డిల్లీకి వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుండి ప్రయాణికులతో బయలుదేరిన ట్రైన్ పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. సీతానగరం మండలం గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో ఒక్కసారిగా ఇంజిన్ నుండి బోగీలు విడిపోయాయి. ఇలా బోగీలను విడిచి ఇంజన్ కిలోమీటర్ పైగా వెళ్లింది. అసలేం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాటు బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ఇంజన్ తిరిగి బోగిలవద్దకు చేరుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.