మెజారిటీ లేకున్నా దుగ్గిరాల ఎంపిపి వైసిపిదే... బాధ్యతలు స్వీకరించిన రూపవాణి
గుంటూరు: ఇటీవల దుగ్గిరాల ఎంపీపీగా ఎన్నికయిన దానబోయిన సంతోష రూపవాణి ఇవాళ (బుధవారం) పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఎండిఓ సమక్షంలో దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్ లో రూపవాణి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపిపికి ఎమ్మెల్యే ఆర్కే శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను మించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారన్నారు. దుగ్గిరాల మండలంలో 14 మంది సర్పంచులు, జడ్పిటిసి, ఎంపిపి, ఎంపీటీసీలు అందరం కలిసి సీఎంని స్పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఆటంకాలు కలిగించినా సరే ఈరోజు సోదరి రూపవాణి ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించటం గొప్ప విజయంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు