విజయవాడలో దొంగల హల్ చల్... తెల్లవారాక ఇంట్లోకి చొరబడి నగలు, నగదు ఛోరీ
విజయవాడ భవానిపురంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగల హల్ చల్ చేసారు.
విజయవాడ భవానిపురంలో శుక్రవారం తెల్లవారుజామున దొంగల హల్ చల్ చేసారు. పూర్తిగా తెల్లారిన తర్వాత ఉదయం 7-8గంటల మధ్య ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు నగలు, నగదు దోచుకెళ్లారు. బీరువా పగలగొట్టి ఒక లక్షా యాభై వేల రూపాయిలు, 6 తులాల బంగారం చోరీ చేసినట్లు సమాచారం.
ప్రియ దర్శిని కాలనీ వాటర్ టాంక్ రోడ్డు శ్యామల కుమారి ఒంటిరిగా ఉంటున్నారు. ఆమె ఉదయం ఇంటినుండి బయటికి వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఇంటిలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. దొంగతనంపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.