Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగానికి వెడుతూ బైక్ అదుపు తప్పడంతో.. అనంతలోకాలకు..

అనకాపల్లి డైట్ కాలేజీ ఎదురుగా ఉన్న విశాఖ డైరీలో పనిచేస్తున్న శివ అనే యువకుడు  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

అనకాపల్లి డైట్ కాలేజీ ఎదురుగా ఉన్న విశాఖ డైరీలో పనిచేస్తున్న శివ అనే యువకుడు  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దీనిపై మృతుని బంధువులు మాట్లాడుతూ తుని మండలం బిఎస్ పేటకు చెందిన శివ గత 4 సం.లుగా విశాఖ డైరీలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా పది రోజులు క్రితం తన స్వగ్రామమైన BS పేటకు వచ్చి తిరిగి డ్యూటీకి వెళుతుండగా బైకు అదుపుతప్పి మృతి చెందాడని అన్నారు.  మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. విశాఖ డెయిరీ  యాజమాన్యం ఈ కుటుంబం పట్ల సానుకూలంగా స్పందించి  ఆదుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.