వంతెనను ఢీకొట్టిన సిమెంట్ లారీ... గాజువాకలో తప్పిన పెను ప్రమాదం
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో పెను ప్రమాదం తప్పింది.
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో పెను ప్రమాదం తప్పింది. వడ్లపూడి శ్రీనగర్ వంతెనపై సిమెంట్ లారీ లోడుతో వెళ్తున్న సమయంలో మరో లారీని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యింది. సిమెంట్ లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వంతెనను ఢీ కొట్టి ఆపాడు. లారీ వంతెనను కాకుండా ఇతర వాహనాలను ఢీకొడితే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా వుండేది.