Asianet News TeluguAsianet News Telugu

రెండు ఆర్టీసి బస్సులు ఢీ...ఐదుగురు దుర్మరణం


విజయనగరం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.


విజయనగరం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం మండలంలోని సుంకరి పేట దగ్గర  ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో  ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే  మృతిచెందారు.  రెండు బసుల్లో ఉన్న చాలా మంది ప్రయాణికులకి కూడా గాయాలు అవ్వడంతో ఆ ప్రాంతం అంత ఆందోళనకరంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడం వల్ల విపరీతంగా పొగ వ్యాపించడంతో స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  రెండు బసుల్లో ఇరుక్కుపోయిన చాలా మంది ప్రయాణికులని బయటకి తీస్తున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలం వద్దకు అంబులెన్స్ లు, పోలీసులు, ఆర్.టి.సి అధికారులు చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్నారు.