సత్తెనపల్లిలో సినిమా వ్యాపారం... థియేటర్లలో ఆర్డివో ఆకస్మిక తనిఖీ
గుంటూరు : సంక్రాంతి పండగ వేళ పెద్దహీరోల సినిమాల విడుదలను కొన్ని థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని ఆర్డివో రాజకుమారి ఆరోపించారు.
గుంటూరు : సంక్రాంతి పండగ వేళ పెద్దహీరోల సినిమాల విడుదలను కొన్ని థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని ఆర్డివో రాజకుమారి ఆరోపించారు. సత్తెనపల్లి పట్టణంలో మూడు థియేటర్లపై ఆర్డివో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం నిర్ణయించిన రేటుకు కాకుండా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు ఆర్డివో తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా థియేటర్ లో పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలా నిబంధలను అతిక్రమిస్తున్న థియేటర్లపై చర్యలు తీసుకుంటామని ఆర్డివో రాజకుమారి తెలిపారు.