మంత్రి ఇలాకాలో ఇదీ పరిస్థితి...జలమయమైన ప్రభుత్వ కార్యాలయం

కర్నూల్: తాజాగా కురిస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా జలమయమైన దయనీయ పరిస్థితి  కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇలాకాలోచోటుచేసుకుంది. 

First Published Aug 10, 2020, 9:24 PM IST | Last Updated Aug 10, 2020, 9:24 PM IST

కర్నూల్: తాజాగా కురిస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా జలమయమైన దయనీయ పరిస్థితి  కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇలాకాలోచోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆలూరు లో గత 30 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ ఆఫీసుల పరిసరాలు వర్షపునీటితో నిండిపోయాయి. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, మోడల్ స్కూల్ కి వెళ్ళే దారులు, పరిసరాలు మోకాళ్లలోతు వర్షపునీటితో నిండిపోయాయి. దాదాపుగా 30 రోజుల నుండి ఈ నీటిలోనే నడుచుకుంటూ వెళుతున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ గోడు వినాలని మొరపెట్టుకుంటున్నారు ఫైర్ సిబ్బంది.దోమల బెడదతో విధులు నిర్వహించాలని భయమేస్తుంది  ఫైర్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.