పిడుగురాళ్లలో విషాదం... రైల్వే క్వార్టర్స్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, అప్పుల బాధ తాళలేక రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్ లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్(43) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, అప్పుల బాధ తాళలేక రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్ లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్(43) బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి బెడ్ రూంలోకి వెళ్లి పడుకున్న కొడుకు తెల్లవారుజామున ఎంతకూ బయటకు రాకపోయేసరికి కంగారుపడిన తల్లి చుట్టుపక్కలవారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా సత్య వర్ధన్ మృతిచెంది కనిపించాడు. సత్య వర్ధన్ కు భార్యతో గత నాలుగు సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నాడని... కూతురు, కొడుకు తనవద్దకు రావడంలేదని తీవ్ర మనస్థానికి గురయినట్లు సత్యవర్ధన్ తల్లి తెలిపింది. అలాగే అప్పులబాధ కూడా ఎక్కువవడంతో సత్యవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు, పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)