Asianet News TeluguAsianet News Telugu

అక్రమ మట్టితవ్వకాలు.. ప్రశ్నించినందుకు పొలంలో టిప్పర్లతో హల్ చల్..


పల్నాడు జిల్లా : అక్రమ మట్టితవ్వకాలు నిర్వహిస్తూ ఇదేమని ప్రశ్నించిన రైతుల పంటను టిప్పర్లతో తొక్కిస్తున్న కృష్ణారెడ్డిపై అధికారులు చర్యలు చేపట్టాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. 


పల్నాడు జిల్లా : అక్రమ మట్టితవ్వకాలు నిర్వహిస్తూ ఇదేమని ప్రశ్నించిన రైతుల పంటను టిప్పర్లతో తొక్కిస్తున్న కృష్ణారెడ్డిపై అధికారులు చర్యలు చేపట్టాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామ పరిధిలో సుమారు 6నెలలుగా ఎటువంటి మైనింగ్ అనుమతులు లేకుండా అక్రమ మట్టితవ్వకాలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. కృష్ణారెడ్డి, అతని అనుచరులపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇదేమని ప్రశ్నించిన మా సొరకాయ పంటను కృష్ణారెడ్డి వారి అనుచరులతో కలసి మట్టితో చదును చేసి నాశనం చేశారని గోదా రమేష్ కుమార్ ఆరోపించారు. మైనింగ్ అనుమతులు లేకుండా మట్టితవ్వకాలు చేపడుతూ మా పొలంలోకి మట్టి టిప్పర్లు ఎందుకు తిప్పుతున్నారని  ప్రశ్నించినందుకు, వారిని బెదిరించడమే కాకుండా.. చేనులో కోసిన సొరకాయలను కూడా టిప్పర్లతో తొక్కించి.. పంటపొలంలోకి టిప్పర్లను తిప్పి పంటను నాశనం చేశారని తెలిపారు.